2017లో విడుదలైన తమిళ చిత్రం విక్రమ్ వేద ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది. ఓ కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామా విమర్శకుల ప్రశంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. పుష్కర్- గాయత్రీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా నటించారు. కాగా ఈ మూవీ హిందీలో రీమేక్ చేయాలని.. ఎప్పటి నుండో స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ప్రస్తుత పరిస్థుతుల రీత్యా ఆయన ఈ మూవీ రీమేక్ ఆలోచన విరమించుకున్నారట.
ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్న అమీర్ విక్రమ్ వేద రీమేక్ వాయిదా వేసినట్లు తెలుస్తుంది. కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో స్పష్టత లేని నేపథ్యంలో లాల్ సింగ్ చద్దా మూవీ పూర్తి అయిన తరువాత ఈ మూవీ గురించి ఆలోచిద్దాం అనేది ఆయన నిర్ణయంగా తెలుస్తుంది. ఇక 1994 లో టామ్ హాంక్స్ హీరోగా వచ్చిన హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది.