హీరో ఆది పినిశెట్టి తన తండ్రి డైరెక్టర్ మరియు రచయిత రవిరాజా పినిశెట్టికి హెయిర్ కట్ మరియు షేవింగ్ స్వయంగా చేశారు. తన సర్వీస్ కి రవిరాజా దగ్గర ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేయడం విశేషం. లాక్ డౌన్ కారణంగా చెన్నైలో స్పాలు మరియు సెలూన్ లు మూతబడ్డాయి. ఒక వేళ తెరిచినా కరోనా భయంతో ఎవ్వరూ వాటికి వెళ్లడం లేదు. ముఖ్యంగా వయసు మీదపడినవారు దూరంగా ఉంటున్నారు. అందుకే రవిరాజా పినిశెట్టి కి కొడుకు ఆదికి హెయిర్ కట్ అండ్ షేవింగ్ చేశారు.
ఈ వీడియో ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆది పినిశెట్టి ప్రస్తుతం క్లాప్ అనే స్పోర్ట్స్ డ్రామాలో హీరోగా నటిస్తున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజ అందిస్తున్నారు.
#Haircut timeeee!!
iam sure I need one more than my Dad????#lockdownlife#staypositive pic.twitter.com/uUAOW2FDuo— Aadhi???? (@AadhiOfficial) June 16, 2020