మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమా నుంచి కాజల్ తప్పుకుందని కారణం డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అంటూ ఇప్పటికే కాజల్ ఈ ప్రాజెక్ట్ నుండి దాదాపు తప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఓ వార్త కాస్త గట్టిగా వినిపించింది. కాగా అలాంటిదేమీ లేదని.. ఆచార్యలో కాజల్ నటిస్తోందని ఇప్పటికే ఆమె ఈ సినిమాకి సంబంధించి టోకెన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నారని కాజల్ మేనేజర్ స్పష్టం చేశారు.
ఇక లాక్ డౌన్ ముగిసిన తరువాత మొదలయ్యే షూట్ లో కాజల్ పాల్గొననుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది.
కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.