కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్డ్..!

కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్డ్..!

Published on Mar 13, 2020 6:58 PM IST

ఎట్టకేలకు దేశవ్యాప్తంగా క్రేజీగా ఎదురుచూస్తున్న కెజిఎఫ్ మూవీ విడుదల తేదీ వచ్చేసింది. అక్టోబర్ 23న ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ నేడు తెలియజేయడం జరిగింది. దీనిపై వారు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. కెజిఎఫ్2 జూన్ లేక జులై లో విడుదల కానుందంటూ ఇప్పటివరకు ప్రచారం జరిగింది అలాగే వారు ఆర్ ఆర్ ఆర్ కి పోటీగా జనవరిలో విడుదల చేసే అవకాశం కలదని కూడా వార్తలు రావడం జరిగింది. ఈ ఊహాగానాలు చెక్ పెడుతూ నేడు దీనిపై ప్రకటన ఇచ్చారు.

2018లో యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ కెజిఎఫ్ ప్రభంజనం సృష్టించింది. పాన్ ఇండియా మూవీ విడుదలైన ఈ చిత్రం అన్ని భాషలలో విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా చాప్టర్ 2 పేరుతో కెజిఎఫ్ 2 వస్తుంది. ఇక ఈ చిత్రంలో విలన్ గా సంజయ్ దత్ నటించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు