అనుష్కతో ‘నిశ్శబ్దం’ అంటూ హేమంత్ మధుకర్ విభిన్నమైన కథతో వైవిధ్యమైన కథనంతో తీసిన ఈ సస్పెన్స్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో థ్రిల్లర్ జోనర్ అభిమానులకు మంచి ఛాయిస్ అయింది. ముఖ్యంగా హేమంత్ మధుకర్ రాసుకున్న స్క్రీన్ ప్లేలో ప్రతి పాత్రను కథలోకి తీసుకొచ్చిన విధానం మెచ్చుకోదగినది. సినిమాలో మెయిన్ క్యారెక్టర్ల టాక్స్ ను చాలా సస్పెన్స్ ప్లేతో నడిపి.. ఫ్రీ క్లైమాక్స్ వరకూ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చాడు. మళ్ళీ అంతలోనే విషాదపు ఛాయల వైపు కథనాన్ని టర్న్ చేసి, బరువైన భావోద్వేగాలతో ఈ సినిమాని హేమంత్ చాలా బాగా తెరకెక్కించాడు.
అలాగే సినిమాలోని పాత్రలకు ఏం జరుగుతుందో అసలు మాధవన్ ను ఎవరు చంపారు అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయిటైన్ చేశాడు.
హేమంత్ మధుకర్ రాసుకున్న ఈ హారర్ క్రైమ్ లవ్ స్టోరీలో.. ఆ స్టోరీ చుట్టూ అల్లిని పాత్రలు, ఆ పాత్రాల తాలూకు సంఘర్షణలు.. మళ్లీ ఆ కథలను పాత్రలను ఒక హత్యతో ముడిపెట్టిన విధానం బాగా ఆకట్టుకుంది. అయితే సినిమాలో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేశాక వచ్చే సన్నివేశాల పై హేమంత్ మధుకర్ ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే ఈ సినిమా అవుట్ ఫుట్ ఇంకా బాగుండేది. మొత్తం మీద ఈ సినిమాతో హేమంత్ మధుకర్ దర్శకుడిగా కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు.