టాప్ డైరెక్టర్ శంకర్ తమిళ్లో తీస్తున్న ‘నన్బన్’ చిత్రం ఈ నెల 14న విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘స్నేహితుడు’ పేరుతో దిల్ రాజు విడుదల చేయబోతున్నారు. స్నేహితుడు చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం స్నేహితుడు చిత్రానికి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హీరో విజయ్ పాత్రకు ప్రముఖ గాయకుడు హేమచంద్ర డబ్బింగ్ చెప్పారు. 8 మందిని స్వర పరీక్ష చేసాక చివరికి హేమచంద్రని ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు నుండి హీరో శ్రీరామ్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారు. మరి కొంత మంది నటులు ఇంకా డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. తెలుగులో జీవా పాత్ర పేరు ‘నిఖిల్’. ఈ చిత్ర మొదటి భాగం తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేసి కుదించారు. శంకర్ గత చిత్రాలు తమిళ్ కంటే తెలుగులో భారీ విజయాలు సాధించాయి. ఈ చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూద్దాం.
స్నేహితుడు కోసం డబ్బింగ్ చెబుతున్న హేమచంద్ర
స్నేహితుడు కోసం డబ్బింగ్ చెబుతున్న హేమచంద్ర
Published on Jan 4, 2012 10:42 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్