రెబెల్ కోసం హెలికాప్టర్ ఫైట్ల చిత్రీకరణ

రెబెల్ కోసం హెలికాప్టర్ ఫైట్ల చిత్రీకరణ

Published on Jul 12, 2012 3:52 AM IST


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రెబెల్” చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక్కడ ప్రత్యేకమయిన హెలికాప్టర్ ఫైట్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తుండగా తమన్నా కథానాయికగా నటిస్తుంది. రెండవ కథానాయికగా దీక్ష సెత్ కనిపించనుంది.ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో జే భగవాన్ మరియు జే పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాక ఈ చిత్రానికి లారెన్స్ తనే స్వయంగా సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమయిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.

తాజా వార్తలు