ఆగడులో పొట్ట చెక్కలయ్యే కామెడీ

ఆగడులో పొట్ట చెక్కలయ్యే కామెడీ

Published on Jan 19, 2014 10:00 PM IST

Aagadu-Movie
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన రాబోయే ఆగడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సూపర్ హిట్ మూవీ ‘దూకుడు’ తర్వాత శ్రీను వైట్ల తో మహేష్ బాబు కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది. ఈ మాస్ ఎంటర్టైనర్ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సారధి స్టూడియోస్ లో జరుగుతోంది. ప్రముఖ తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం శ్రీను వైట్ల ఈ సినిమాలో మరింత ఎక్కువ కామెడీ ఉండేలా ప్లాన్ చేసుకున్నారని, అది చాలా బాగా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. ‘కొన్ని రోజులు నవ్వులతో మొదలవుతుంది, ఆ నవ్వుల్ని మనం ఆపలేం. అవును మీ ఊహించింది కరెక్ట్ ఆగడు షూటింగ్ లోనే, సీన్స్, డైలాగ్స్ అన్నీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వును తెప్పిస్తాయి. నవ్వు ఆపుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని’ వెన్నెల కిషోర్ ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం సారధి స్టూడియోస్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే నానక్రామ్ గూడాకి షిఫ్ట్ అవుతుంది. ఆ షెడ్యూల్ ఫిబ్రవరి 6 కల్లా ముగుస్తుంది. మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు