రామ్, తమన్నా జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం. ప్రేమ కథా చిత్రాలు చేయడంలో తనకంటూ ఒరత్యేక ముద్ర వేసుకున్న కరుణాకరన్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్ర ఆడియో త్వరలో విడుదల కానుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో హక్కుల కోసం పలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. కరుణాకరన్ – జివి ప్రకాష్ కుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, డార్లింగ్’ సినిమాలను మించే స్థాయిలో ఈ సినిమా పాటలుంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ చిత్రాలు తీసి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రానికి నిర్మాత.