హార్ట్ ఎటాక్ పాటలతో కిక్కెక్కిస్తున్న పూరి

హార్ట్ ఎటాక్ పాటలతో కిక్కెక్కిస్తున్న పూరి

Published on Jan 22, 2014 4:01 AM IST

Heart-Attack
యువతకు కిక్కెక్కించే పాటలను అందించడంలో పూరి సిద్ధహస్తుడు. ఈసారి కుడా హార్ట్ ఎటాక్ రూపంలో మ్యూజిక్ లవర్స్ కు మ్యూజికల్ ఎటాక్ ను ఇచ్చాడు. లిరిక్స్ క్యాచీగా ఉండడం, ట్యూన్స్ కొత్తగా ఉండడంతో ఈ సినిమా పాటలు ప్రేక్షకులకు చేరువయ్యాయి

నితిన్, ఆదా శర్మ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రధానపాత్రధారులు. ఈ సినిమాలో నితిన్ పోనీ టెయిల్ తో ట్రెండీ లుక్ తో కనిపించనున్నాడు. పూరీజగన్ ఈ సినిమాకు దర్శక నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. అమోల్ రథోడ్ సినిమాటోగ్రాఫర్. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటర్

హార్ట్ ఎటాక్ సినిమాను స్పెయిన్, గోవా ప్రాంతాలలో తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 31న విడుదలకానుంది

తాజా వార్తలు