చివరి దశకు చేరుకున్న హార్ట్ అటాక్ షూటింగ్

చివరి దశకు చేరుకున్న హార్ట్ అటాక్ షూటింగ్

Published on Nov 25, 2013 4:42 PM IST

Nitin

యంగ్ హీరో నితిన్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రానున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హార్ట్ అటాక్’. 2014 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మరో 4 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని ఓ చిన్న ఫైట్ సీక్వెన్స్ ని గోవాలో షూట్ చేస్తున్నారు.

ఈ సినిమా ద్వారా ఆద శర్మ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కానుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 8న రిలీజ్ చేయనున్నారు. ఎస్ఆర్ శేఖర్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గాపనిచేస్తున్నాడు. ‘హార్ట్ అటాక్’ సినిమా ఫుల్ కామెడీ కలగలిపిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు.

తాజా వార్తలు