నితిన్, పూరి కలయికలో తెరకెక్కుతున్న ‘హార్ట్ ఎటాక్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోవుంది. ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదలచెయ్యాలనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి బరిలోనుండి తప్పుకుంది. త్వరలో ఈ వార్తను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఆదాః శర్మ హీరోయిన్. పూరి జగన్ దర్శకనిర్మాత. నితిన్ కు ఒక వైవిధ్యమైన పాత్ర ఇచ్చారని సమాచారం. బ్రహ్మానందం, ఆలి మంచి పాత్రలలో కామెడిని కూడా బాగా పండించారట. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్