ఎడిటర్ లాగా అలోచించి తీసే డైరెక్టర్- రానా

ఎడిటర్ లాగా అలోచించి తీసే డైరెక్టర్- రానా

Published on Nov 4, 2012 6:46 PM IST


టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఈ సినిమా గురించి రానా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ గురించి మాట్లాడుతూ ‘ అందరూ అనుకుంటారు చూడటానికి నాటకాల నేపధ్యంలా ఉంది కనుక సినిమా చాలా పెద్దగా ఉంటుందని, కానీ ఈ సినిమా కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. క్రిష్ కి సినిమాకి ఏమి కావాలో అనేది చాలా బాగా తెలుసు. అతను ఒక ఎడిటర్ లాగా అలోచించి సినిమాకి దర్శకత్వం వహించారు. అందుకనే అతను అవసరానికంటే మించి ఏమీ షూట్ చెయ్యలేదని’ ఆయన అన్నారు. రానా బి.టెక్ బాబుగా సురభి నాటకాలు వేసే పాత్రలో కనిపిస్తారు. కొంచెం గ్యాప్ తీసుకొని ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్న అందాల భామ నయనతార జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. జాగర్లమూడి సాయి బాబు – వై. రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు