తన కామెడీతో అందరినీ నవ్వించే అల్లరి నరేష్ అంటే మీ అందరికీ ఇష్టమే అని మాకు తెలుసు. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ తోనే కాకుండా, అందరితో కలిసిపోయే మనస్తత్వం గల మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు. అల్లరి నరేష్ తాజా చిత్రం ‘యాక్షన్ 3డి’, ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీ అభిమాన హీరోతో మాట్లాడే ఆద్భుతమైన అవకాశాన్ని మేము కలిగిస్తున్నాం.
మీ దగ్గర అల్లరి నరేష్ ని అడగడానికి ప్రశ్న ఉందా? ఆయన గురించిన ప్రత్యేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదిగో మేము అందిస్తున్న అవకాశం ఉపయోగించుకోండి..
మీరు అడగాలనుకున్న ప్రశ్న, ఆ ప్రశ్నకి మీ పేరు, మీ వివరాలను జత చేసి [email protected] కి మెయిల్ చెయ్యండి.
ఆ ప్రశ్నలని మేము అల్లరి నరేష్ కి పంపుతాం. ఆయన ఇచ్చిన సమాధానాలను మేము మీ పేరుతో పాటు ప్రచురిస్తాం.
ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్.. వెంటనే మీ ప్రశ్నలని పంపండి, వాటికి అల్లరి నరేష్ ఏమి సమాధానాలు ఇస్తారో చూద్దాం..