నయనతారకి జోడీగా హర్షవర్ధన్

నయనతారకి జోడీగా హర్షవర్ధన్

Published on Jul 11, 2013 6:00 PM IST

Harsha-Vardhan-and-nayanata

‘తకిట తకిట’, ‘అవును’ సినిమాలో కనిపించి నటుడిగా పేరు తెచ్చుకున్న హర్షవర్ధన్ ఓ క్రీజీ ప్రాజెక్ట్ లో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసాడు. అది కూడా నయనతార సరసన నటించే అవకాశం. ఏంటి నయనతార – హర్షవర్ధన్ హీరో హీరోయిన్ గా సినిమా చేస్తున్నారేమో అనుకునేరు.. అలా ఏమీ కాదు అసలు విషయంలోకి వెళితే .. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘అనామిక’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిందీలో వచ్చిన ‘కహానీ’ సినిమాకి రీమేక్.

ఈ సినిమాలో నయనతార భర్తగా ఓ పాత్ర ఉంటుంది. హిందీలో అయితే ఈ పాత్రని ఫోటోలో మాత్రమే చూపించి వదిలేసారు కానీ శేఖర్ కమ్ముల ఆ పాత్రని నిజంగా ఉండేలా కథని మార్చారు. దాంతో ఇన్ని రోజులు నయనతారకి భర్తగా కనిపించే అవకాశం ఎవరికి దక్కుతుందా అని అనుకుంటుంటే ఆ అవకాశం చివరికి ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న హర్షవర్ధన్ కి దక్కింది. దాంతో ఎప్పటి నుంచో ‘ శేఖర్ కమ్ముల గారితో వర్క్ చెయ్యాలనుకుంటున్న నా కోరిక తీరిందని’ హర్షవర్ధన్ చాలా సంతోషంగా ఉన్నాడు.

తాజా వార్తలు