పవన్ కోసం హరీష్ అద్భుతమైన ప్లానింగ్?

పవన్ కోసం హరీష్ అద్భుతమైన ప్లానింగ్?

Published on Sep 4, 2020 3:00 AM IST

దాదాపు రెండున్నరేళ్లు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడంతో పవన్ అభిమానులు మళ్ళీ తమ హీరోను వెండితెర మీద చూడొచ్చని అనుకున్నారు. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో ఆ రీఎంట్రీ సినిమా కాస్తా మరింత ఆలస్యం కావాల్సి వచ్చింది. అయితే పవన్ ఇలా సినిమాలు మొదలు పెట్టడమే జస్ట్ ఒక సినిమాతో కాకుండా రెండు మూడు ప్రాజెక్టులను వరుసగా లైన్ లో పెట్టేసారు.

అయితే వీటిలో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఈ సినిమా ఎలాంటి రీమేక్ కాదని పూర్తిగా కేవలం స్ట్రయిట్ సినిమాయే అని హరీష్ తెలిపారు. అయితే ఈ చిత్రంలో పవన్ ను నెవర్ బిఫోర్ స్టైలిష్ గా చూపిస్తానని హరీష్ తెలిపారు.

కానీ ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రంలో పవన్ రోల్ ను హరీష్ అద్భుతంగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఒక్కసారిగా మంచి అటెన్షన్ ను తెచ్చుకున్నారు. అలాగే ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా మాత్రమే కాకుండా మంచి మెసేజ్ కూడా ఉండేలా హరీష్ తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తుంది.

తాజా వార్తలు