ఎన్.టి.ఆర్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు చేసిన హరీష్ శంకర్

ఎన్.టి.ఆర్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు చేసిన హరీష్ శంకర్

Published on Jul 17, 2013 5:44 PM IST

Ramayya-Vasthavayya

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. ఈ సినిమాని సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారని, ఆడియోని ఆగష్టులో విడుదల చేసే అవకాశం వుందని సమాచారం. అయితే హరీష్ శంకర్ ఈ విషయన్ని మరోసారి ట్విట్టర్ ద్వారా ‘ఏది ఏమైనా’ సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్టు తెలియజేశాడు. ‘ప్రస్తుతం వినిపిస్తున్నరోమర్స్ ని ప్రక్కన పెట్టండి ‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియోని ఆగష్టులో, సినిమాని సెప్టెంబర్ 27న ఏది ఏమైనా విడుదల చేస్తాం’ అని హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హసన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ తన కెరీర్ లో బెస్ట్ లుక్ గా నిలుస్తుందని బావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు