‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. దీనికి ముందు పవన్ కళ్యాణ్ చేసిన పాన్ ఇండియా సినిమాలకి భిన్నంగా రీజనల్ గా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ తీసిన కంటెంట్ తోనే సాలిడ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం మళ్ళీ ఎట్టకేలకి షూటింగ్ పునః ప్రారంభం చేసుకుంది.

ఇలా జెట్ స్పీడ్ లో కొనసాగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై సాలిడ్ అప్డేట్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు అందించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ ఉస్తాద్ ట్యూన్స్ వర్క్ లో ఉన్నట్టుగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి మ్యూజికల్ అప్డేట్ ని అందించారు. దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని పనులు మళ్ళీ వేగవంతం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version