తెలుగు స్టేట్స్ లో ‘వీరమల్లు’ టికెట్ ధరలు డీటెయిల్స్.. హైక్ ఎంత?

తెలుగు స్టేట్స్ లో ‘వీరమల్లు’ టికెట్ ధరలు డీటెయిల్స్.. హైక్ ఎంత?

Published on Jul 18, 2025 10:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే పవన్ గత చిత్రాలకి టికెట్ ధరల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

కానీ ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తన సినిమా ఓపెనింగ్స్ లెక్కలు మారేలా ఉన్నాయని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హరిహర వీరమల్లు సినిమాకి వచ్చే హైక్స్ పై ఇప్పుడు నుంచే బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఏపీలో సింగిల్ స్క్రీన్ గరిష్ట టికెట్ ధర 230 నుంచి మల్టిప్లెక్స్ కి 295 వరకు ఉండొచ్చట.

అలాగే తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ కి గరిష్టంగా 265 నుంచి మల్టిప్లెక్స్ కి 413 ఉంటుందని తెలుస్తుంది. ఈ ధరలే కొన్ని రోజులు పాటు కొనసాగనున్నాయి. ఇక వీటిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ప్రీరిలీజ్ ఈవెంట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 24న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు