ఈ సినిమాలకి “వీరమల్లు” టెన్షన్?

ఈ సినిమాలకి “వీరమల్లు” టెన్షన్?

Published on Mar 2, 2025 10:00 PM IST

చూస్తుండగానే అందరితో పాటుగా టాలీవుడ్ క్యాలండర్ లో అప్పుడే రెండు నెలలు గడిచిపోయాయి. ఇక మార్చ్ నెల వచ్చేసింది, ఈ నెలలో అయితే సాలిడ్ సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. అయితే ఈ చిత్రాల్లో నెలాఖరుకి మాత్రం అసలు బ్యాంగ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ మార్చ్ ఎండింగ్ లో ఆడియెన్స్ లో మంచి బజ్ ఉన్న సినిమాలే ఉన్నాయి.

మెయిన్ గా మార్చ్ 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” ఉంది. అయితే ఇదే డేట్ లో నితిన్ రాబిన్ హుడ్ ఉంది దీనితో పాటుగా యూత్ ఫుల్ డ్రామా మ్యాడ్ స్క్వేర్ కూడా కొత్తగా డేట్ మార్చుకుంది. అయితే పవన్ లాంటి స్టార్ సినిమా ఉన్నప్పటికీ ఈ రెండు సినిమాలు డేట్స్ ఖరారు చేసుకున్నారు మేకర్స్ పైగా ఈ రెండు సినిమాల నిర్మాతలు కూడా పవన్ కి అత్యంత సన్నిహితులే..

అయితే ఇప్పటికీ వీరమల్లు సినిమా మార్చ్ 28 రేస్ లోనే ఉందని మేకర్స్ చెబుతున్నారు. దీనితో ఆ రెండు సినిమాలకి చిన్న టెన్షన్ లేకపోలేదు అలాగే ఎక్కడో చిన్న హోప్ కూడా లేకపోలేదు. వీరమల్లు సినిమా మార్చ్ 28న రాదు కాబట్టే రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ మేకర్స్ ఈ డేట్ కి తమ సినిమాలు అనౌన్స్ చేసుకున్నారని టాక్ ఉంది.

ఇంకా వీరమల్లు సినిమా కోసం పవన్ నాలుగు రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉందట. అవి ఇస్తే కానీ వీరమల్లు ముందుకు కదిలే ఛాన్స్ లేదు. అలాగే ఇప్పట్లో ఇచ్చినా కూడా వెంటవెంటనే అంటే అన్నీ అయ్యే పనులు కూడా కాదు. సో ప్రస్తుతానికి వీర విషయం ఒకింత సస్పెన్స్ గానే ఉంది. మరి చూడాలి మేకర్స్ దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు