‘హరిహర వీరమల్లు’లో నెవర్ బిఫోర్ గా అంటున్న మేకర్స్!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ పట్ల ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విడుదల తేదీ ఎప్పుడు ఏంటి అనేవి ఫ్యాన్స్ లో సస్పెన్స్ గా మారాయి. అయితే ఈ సినిమా పవన్ కెరీర్లో మొదటి హిస్టారికల్ జానర్ అందులోని భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ కలగలిపిన ప్రాజెక్ట్ అని అందరికీ తెలిసిందే. ఈ కారణం చేత కూడా సినిమా బాగా ఆలస్యం అవుతూ వచ్చింది.

అయితే ఇన్ని రోజులు నుంచి సినిమాకి పని చేస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ బృందం ఫైనల్ గా సినిమా వి ఎఫ్ ఎక్స్ పనులని పూర్తి చేసేసినట్టుగా మేకర్స్ ఇపుడు సోల్యూడ్ అప్డేట్ అందించారు. అల్ జారః స్టూడియోస్ వారు దాదాపు రెండేళ్లు పాటుగా హరిహర వీరమల్లు కి కష్టపడి పని చేసి మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ని అందించారు అని మేకర్స్ కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. ఇక అంతే కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా హరిహర వీరమల్లు నెవర్ బిఫోర్ ట్రీట్ ఇస్తుంది అని మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు.

Exit mobile version