అక్కడ భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న ‘అఖండ 2’..!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్ ఈ అంచనాలు అమాంతం పెంచేసింది.

విధ్వంసం సృష్టించేందుకు బాలయ్య-బోయపాటి మాస్ కాంబో మరోసారి రెడీ అయిందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే, ఈ టీజర్‌కు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని అక్కడ భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు.

‘అఖండ 2’ టీజర్ కోసం మేకర్స్ ఏకంగా రూ.1.6 కోట్లు ఖర్చు పెట్టారని.. దీంతో ఈ సినిమా కోసం అక్కడి ప్రమోషన్స్‌ను చాలా గ్రాండ్‌గా చేయబోతున్నారనేది కన్ఫర్మ్ అయింది. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version