ఓటిటిలో గ్లోబల్ వైడ్ గా అదరగొడుతున్న ‘జాట్’

బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ హీరోగా రణదీప్ హూడా అలాగే రెజీనా నెగిటివ్ పాత్రల్లో మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ మసాలా యాక్షన్ చిత్రం “జాట్”. సన్నీ డియోల్ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ ఇచ్చిన ఈ చిత్రం రీసెంట్ గానే దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. హిందీ సహా తెలుగులో కూడా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఇందులో అదరగొడుతుంది.

ఒక్క ఇండియా వైడ్ గానే కాకుండా గ్లోబల్ లెవెల్లో కూడా ట్రెండింగ్ లో నిలిచి దూసుకెళ్తుంది అని నెట్ ఫ్లిక్స్ వారు చెబుతున్నారు. నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో వరల్డ్ వైడ్ గా టాప్ 4 లో ట్రెండ్ అవుతుండగా టాప్ 10 లో అయితే మొత్తం 17 దేశాల్లో ట్రెండింగ్ లో ఉందట. ఇలా మొత్తానికి ఓటిటిలోకి వచ్చాక కూడా జాట్ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version