ట్రైలర్ టాక్: ఊహించని విజువల్, యాక్షన్ ఫీస్ట్ తో ‘హరిహర వీరమల్లు’

ట్రైలర్ టాక్: ఊహించని విజువల్, యాక్షన్ ఫీస్ట్ తో ‘హరిహర వీరమల్లు’

Published on Jul 3, 2025 11:26 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ అవైటెడ్ బిగ్ డే ఎట్టకేలకు నేడు వచ్చేసింది. తన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన స్ట్రైట్ చిత్రం “హరిహర వీరమల్లు” అనేక ఒడిదుడుకుల తర్వాత ఎట్టకేలకి థియేటర్స్ లో బ్లాస్టింగ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. మరి నేడు అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ గ్రాండ్ గా థియేటర్స్ సహా ఆన్లైన్ లో కూడా విడుదల చేసేసారు.

ది బెస్ట్ ట్రైలర్ కట్ అంటూ గట్టి హైప్ ఇచ్చిన ట్రైలర్ ఇదే రీతిలో ఉందని చెప్పాలి. మేకర్స్ చెప్పాలి అనుకున్న కథని అర్జున్ దాస్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్ తో మొదలు పెట్టుకున్న ఈ ట్రైలర్ ఊహించని విజువల్స్ ఇంకా యాక్షన్ ఎలిమెంట్స్ తో అదిరే లెవెల్లో కనిపిస్తుంది. అని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా ఇందులో కనిపిస్తున్నారు.

తనపై యాక్షన్ బ్లాక్ లు కూడా మునుపెన్నడూ చూడని మహా విధ్వంసంలా కనిపిస్తున్నాయి. తనపై ఎలివేషన్స్ గాని ఔరంగజేబుగా బాబీ డియోల్ కూడా ఊహించని లెవెల్లో అగుపిస్తున్నాడు. ఇంకా హీరోయిన్ నిధి అగర్వాల్ స్టన్నింగ్ గా కనిపిస్తుండగా పవన్ తో సన్నివేశంలో కూడా బాగుంది.

ఇంకా ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాగుతున్న ఓ పాట ఇంకా లాస్ట్ లో క్రేజీ విజువల్స్ అదిరే లెవెల్లో కనిపిస్తున్నాయి. వీటితో మాత్రం ఇన్నేళ్లు చూసిన నిరీక్షణకు గ్రాండ్ విజువల్ కం యాక్షన్ ట్రీట్ ని మేకర్స్ ఈ జూలై 24న పాన్ ఇండియా లెవెల్లో అందించబోతున్నారని చెప్పవచ్చు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు