పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ అలాగే జ్యోతి కృష్ణ తెరకెక్కించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు కోసం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యిన రోజే ఒక కంప్లైంట్ బాగా అందుకుంది. సినిమాలో వి ఎఫ్ ఎక్స్ బాగోలేవని కామెంట్స్ వినిపించాయి.
అయితే ఈ సీన్స్ తీసేసి కొత్త వెర్షన్ ని మేకర్స్ అప్డేట్ చేస్తారని టాక్ వినిపించింది. మరి ఈ కొత్త వెర్షన్ నేటి నుంచే థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది అన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహించారు.