మరో కొత్త వివాదంలో హరిహర వీరమల్లు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిస్టారికల్ ఎపిక్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించారు. రిలీజ్ కు దగ్గరవుతున్న ఈ సినిమా ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న వీరమల్లు పాత్ర తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవితానికి దగ్గరగా ఉందని.. కానీ మేకర్స్ ఈ విషయాన్ని రివీల్ చేయడం లేదని పలు బహుజన సంఘాలు విమర్శిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో వీరమల్లు పాత్ర ఎవరి స్ఫూర్తి తో రాసుకున్నారో తెలపాలని మేకర్స్ ని డిమాండ్ చేస్తున్నారు.

మరి ఈ విషయం పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమా జూలై 24 న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Exit mobile version