విద్యార్ధులకు ‘హరిహర వీరమల్లు’ స్పెషల్ షోలు.. సనాతన ధర్మం తెలియాల్సిందే..!

HHVM Movie

సమాజాంలో జరిగే విషయాలను ప్రజలకు అందించడంలో సినిమా ఒక అద్దంలా పనిచేస్తుంది. ఇక సినిమాలోని మంచిని తీసుకోవాలి. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో సమాజానికి పనికొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సనాతన ధర్మం రక్షణ గురించి ఈ సినిమాను రూపొందించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఔరంగజేబ్ అకృత్యాలపై తిరుగుబాటు చేసిన వీరుని జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఓ వీరుడు చేసిన యుద్ధం మనకు ఈ సినిమాలో చూపెట్టారు. ఇందులోని యాక్షన్‌, గ్రాండియర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని చారిత్రక దృక్కోణాన్ని రాబోయే తరాలకు తప్పక తెలియాలి. ఈ విషయంపై ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది.

రాష్ట్రంలోని విద్యార్ధులకు ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శించాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. చరిత్రలోని ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయని.. అవి మన భావితరాలకు తప్పకుండా అందించే విధంగా ఆ సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. దీని కోసం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.

ఇక హరిహర వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు సాధిస్తోంది. రెండో వారం వికెండ్‌లో కూడా సాలిడ్ రెస్పాన్స్ లభించింది. దర్శకుడు జ్యోతికృష్ణ, క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాను ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version