వీరమల్లు రిలీజ్ డేట్‌ను డిసైడ్ చేసేది వారే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ ఫోటోను కూడా వారు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారట మేకర్స్. అయితే, ఈ సినిమాను వేసవి కానుకగా మే 30న గ్రాండ్ రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో పూర్తి నిర్ణయం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో చేతిలో ఉందని తెలుస్తోంది.

ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దీంతో ఈ సినిమాను మే 30న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్‌పై వారు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, మేకర్స్ ఈ రిలీజ్ డేట్‌ను జూన్ రెండో వారానికి మార్చాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. అలా అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూల్‌గా ముగించేయవచ్చని చిత్ర యూనిట్ భావిస్తోందట.

మరి వీరమల్లు మేకర్స్ కోరికను అమెజాన్ ప్రైమ్ వీడియో వింటుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

Exit mobile version