పవర్ ప్యాక్డ్ యుద్ధానికి సిద్ధమవుతున్న హరిహర వీరమల్లు.. కేరళలో రిలీజ్ చేస్తున్న లక్కీ హీరో!

పవర్ ప్యాక్డ్ యుద్ధానికి సిద్ధమవుతున్న హరిహర వీరమల్లు.. కేరళలో రిలీజ్ చేస్తున్న లక్కీ హీరో!

Published on Jun 23, 2025 11:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కు వేరే లెవెల్ రెస్పాన్స్ లభిస్తోంది.

అయితే, ఈ సినిమా రిలీజ్ పలుసార్లు వాయిదా పడటంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక రీసెంట్‌గా ఈ మూవీని జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్రాన్ని కేరళలో హీరో దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ వేఫారర్ ఫిలిం పై గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు