కల్యాణ్ దేవ్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మాతగా పులివాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సూపర్ మచ్చి’. కాగా ఈ సినిమా యూనిట్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను పోస్ట్ చేసింది. ఇక పోస్టర్ లో కళ్యాణ్ దేవ్ లుంగీ అండ్ షర్ట్ తో ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ పోస్టర్ ఇంట్రస్ట్ గా ఉంది.
ఇక ఈ చిత్రం కన్నడలో కూడా రిలీజ్ కాబోతుంది. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం తాజాగా అనౌన్స్ చేసింది. ఇక ఈ చిత్రంలో కల్యాణ్‌దేవ్ సరసన కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని ప్రేమ సన్నివేశాలు సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.
మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు.
అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం పై కూడా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.