అంజలి దేవికి జన్మదిన శుభాకాంక్షలు

అంజలి దేవికి జన్మదిన శుభాకాంక్షలు

Published on Aug 24, 2013 11:58 AM IST

anjali-devi

తెలుగు సినిమాలలో ఎన్నో రకాల పాత్రలను చేసి అందరిని మెప్పించిన అలనాటి అందాలనటి అంజలి దేవి 85వ పుట్టినరోజు ఈ రోజు. ఆమె తెలుగులో దాదాపు 350కి పైగా సినిమాలలో నటించారు. అలాగే తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించారు. అలనాటి పౌరాణిక సినిమాలలో ఎన్.టి.ఆర్, కాంతారావు, ఎస్వీ రంగారావు లాంటి వారందరి సరసన నటించింది. అంతేకాకుండా ఈ కాలం హీరోలకు తల్లిగా, వదినగా కూడా ఆమె నటించారు. తెలుగులో మొదట కలర్ లో వచ్చిన ‘లవ కుశ’ సినిమాలో ఆమె సీత పాత్రలో నటినిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాదించింది.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురంలో జన్మించిన అంజలి దేవి పి. ఆదినారాయణ రావు ను వివాహం చేసుకొని చెన్నైలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు.ఆమె నటించిన మొదటి సినిమా ‘రాజా హరిచంద్ర’ విడుదల కాలేదు. ఆ తరువాత తను 1947లో నటించిన ‘బాలరాజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అంజలి దేవికి జన్మదిన శుభాకాంక్షలు

తాజా వార్తలు