విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ ఈ రోజు తన 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1960 లో మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు గారి కుటుంబలో పుట్టి చెన్నైలో పుట్టి అక్కడే తన చదువు పూర్తి చేసుకున్నారు. 1986లో ‘కలియుగ పాండవులు’ సినిమాతో రంగప్రవేశం చేసిన వెంకటేష్తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. 7 నంది అవార్డులు మరియు 4 ఫిలిం ఫేర్ అవార్డులు ఆయన గెలుచుకున్నారు. బొబ్బిలి రాజా, స్వర్ణ కమలం, శత్రువు, కూలీ నెం 1, క్షణం క్షణం, ధర్మ చక్రం, చంటి, ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావ్ వంటి పలు హిట్ చిత్రాల్లో ఆయన నటించారు.
కుటుంబ చిత్రాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్నేహితులని సంపాదించుకున్నారు. ఆయన త్వరలో ‘బాడీగార్డ్’ సినిమాతో మనముందుకి రానున్నారు.ఇదే కాకుండా మహేష్ బాబుతో మల్టి స్టారర్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేయబోతున్నారు.