హ్యాపీ బర్త్ డే టు స్టైలిష్ స్టార్, ఫ్యూచర్ స్టార్, లిటిల్ స్టార్.!!

హ్యాపీ బర్త్ డే టు స్టైలిష్ స్టార్, ఫ్యూచర్ స్టార్, లిటిల్ స్టార్.!!

Published on Apr 8, 2013 8:02 AM IST

Akhila-and-Allu-Arjun
ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. అతని బర్త్ డే ని మరో ఇద్దరు వ్యక్తులతో షేర్ చేసుకోనున్నాడు. వాళ్ళలో ఒకరు ఫ్యూచర్ స్టార్, మరొకరు లిటిల్ స్టార్. వీళ్ళు ఎవరా అనుకొంటున్నారా? ఫ్యూచర్ స్టార్ అంటే అక్కినేని అఖిల్, లిటిల్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్.

అల్లు అరవింద్ – శ్రీమతి నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జన్మించాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా బన్ని అతి తక్కువ కాలంలోనే తన టెర్రిఫిక్ డాన్సులతో, స్టైలిష్ కాస్టూమ్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం యూత్ మరియు స్టూడెంట్స్ లో బన్నికి మంచి ఫాలోయింగ్ ఉంది. 2003 లో వ్వచ్చిన గంగోత్రి సినిమాతో ప్రేక్షకులను పరిచయమైన బన్ని ఆ తర్వాత మంచి సినిమాలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత సంవత్సరం ‘జులాయి’ తో హిట్ అందుకున్న బన్ని తన రాబోవు ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో మే లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ప్రస్తుతం తయారవుతున్న స్టార్ అఖిల్ అక్కినేని. తను ఫ్యూచర్ లో హీరోగా అరంగేట్రం చేయడానికి రంగం సిద్దమవుతోంది. అతని లుక్, లెజెండ్రీ పర్సన్ వారసత్వం కావడం వల్ల ఇప్పటికే అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కినేని నాగార్జున – అక్కినేని అమల సంతానం అఖిల్ అక్కినేని. అఖిల్ మంచి క్రికెట్ ప్లేయర్, అలాగే ప్రస్తుతం అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు నేర్చుకుంటున్నాడు.

ఇక చివరిగా లిటిల్ స్టార్ అఖీరా నందన్. పవన్ కళ్యాణ్ – రేను దేశాయ్ దంపతులకి 2004 ఏప్రిల్ 8 న జన్మించాడు.

ఈ ముగ్గురు స్టార్స్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు