హ్యాపీ బర్త్ డే టు అల్లు అర్జున్

హ్యాపీ బర్త్ డే టు అల్లు అర్జున్

Published on Apr 8, 2014 8:48 AM IST

allu-arjun

ఈ రోజు టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుట్టిన రోజు. అల్లు అరవింద్ – శ్రీమతి నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జన్మించాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బన్ని అతి తక్కువ కాలంలోనే తన టెర్రిఫిక్ డాన్సులతో, స్టైలిష్ కాస్టూమ్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం యూత్ మరియు స్టూడెంట్స్ లో బన్నికి మంచి ఫాలోయింగ్ ఉంది. 2003 లో వ్వచ్చిన గంగోత్రి సినిమాతో ప్రేక్షకులను పరిచయమైన బన్ని ఆ తర్వాత మంచి సినిమాలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ బర్త్ డే అల్లు అర్జున్ కి సంథింగ్ స్పెషల్ ఎందుకంటే ఇటీవలే బన్ని – స్నేహ దంపతలకు మగబిడ్డ జన్మించాడు. అలాగే త్వరలోనే తను నటించిన ‘రేసు గుర్రం’ సినిమా రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున అల్లు అర్జున్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు