హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ రజినీ కాంత్

హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ రజినీ కాంత్

Published on Dec 12, 2013 8:15 AM IST

rajinikanth
సినీ ఇండస్ట్రీలో ఎవరి అండా లేకుండా ఎంటర్ అయ్యి అత్యున్నత స్థానాలకు చేరుకున్న అతికొద్ది మంది హీరోల్లో సూపర్ స్టార్ రజినీ కాంత్ ఒకరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రమే ఆయన్ని ఈ స్థాయికి చేర్చిందని చెప్పుకోవచ్చు. నేడు సూపర్ స్టార్ రజినీ పుట్టిన రోజు. 1950 డిసెంబర్ 12 బెంగుళూరులో జన్మించిన రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు.

కండక్టర్ గా పనిచేస్తున్న రజినీకాంత్ ఆ తర్వాత నాటకాలు వేయడం ప్రారంభించాడు. చివరికి 1975 లో ‘అపూర్వ రాఘంఘల్’ సినిమా ద్వారా తమిళ చిత్ర సీమకి పరిచయమయ్యాడు. అలా కెరీర్ ప్రారంభించిన రజినీ 1978లో భైరవి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాతోనే సూపర్ స్టార్ గా ముద్ర వేసుకున్న రజినీ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రజినీకాంత్ కి ఒక్క సౌత్ ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఫుల్ క్రేజ్ ఉంది.

రజినీకాంత్ నటించిన అంతులేని కథ, దళపతి, పెదరాయుడు, భాషా, ముత్తు, అరుణాచలం, నరసింహ, చంద్రముఖి, రోబో లాంటి సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఇంత వయసు వచ్చినప్పటికీ రజినీ స్టైల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. రజినీకాంత్ అంటే స్టైల్ కి ఐకాన్ గా చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా చాలా నిరాడంబరంగా జీవితాన్ని గడపడమే ఆయన స్టార్డంకి అసలైన కారణం. రజినీ నటించిన ‘కొచ్చాడియాన్’ సినిమా త్వరలో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున సూపర్ స్టార్ కి జమడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు