నేడే సిద్ధార్థ్ పుట్టిన రోజు

నేడే సిద్ధార్థ్ పుట్టిన రోజు

Published on Apr 17, 2012 12:56 PM IST


యువ హీరో సిద్ధార్థ్ నేటితో 33 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్ 17న 1979లో తమిళనాడులోని అయ్యర్ కుటుంబలో జన్మించిన సిద్ధార్థ్. చిన్ననాటి జీవితం అంతా చెన్నై మరియు డిల్లీ లోనే సాగింది. ముంబై లోని ఎస్.పి జైన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్ లో ఎమ్బిఎ పూర్తి చేసిన సిద్ధార్థ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద అమృత వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఆ తరువాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘బోయ్స్’ సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత నటించిన ‘నువ్వొస్తానంటే నేనోద్దంటాన’ చిత్రం విజయం అందుకున్నాడు. ‘బొమ్మరిల్లు’ సినిమా ద్వారా నటుడిగా తానెంతో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ దీప మెహత డైరెక్షన్లో ‘మిడ్ నైట్స్ చిల్డ్రన్’ మరియు ‘చష్మే బద్ధూర్’ అలాగే తెలుగులో నందిని డైరెక్షన్లో సమంతాతో ఒక సినిమాలో నటిస్తున్నాడు.

123తెలుగు.కాం తరపున సిద్ధార్థ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

తాజా వార్తలు