నేడు శృతి పుట్టిన రోజు

నేడు శృతి పుట్టిన రోజు

Published on Jan 28, 2012 11:05 AM IST


అందాల భామ శుతి హసన్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సంవత్సరం తనకి పత్యేకం కానుంది. ప్రస్తుతం ఆమె ముంబైలో తన తల్లి మరియు చెల్లెలుతో ఈ వేడుక జరుపుకోనుంది. ఈ సంవత్సరం శృతి తెకుగు మరియు తమిళ భాషల్లో పెద్ద సినిమాలే చేయబోతుంది. పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్’ మరియు ధనుష్ తో చేసిన ‘3’ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. గత సంవత్సరం ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒక ధీరుడు’ చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆమె నటించిన ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రం విజయం సాధించగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రానున్న గబ్బర్ సింగ్ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతుంది.

123తెలుగు.కామ్ తరపున శృతి హసన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

తాజా వార్తలు