టాలెంటెడ్ సింగర్ శ్రేయ ఘోషల్ తన 30 వ పుట్టినరోజుని ఈ రోజు జరుపుకొంటోంది. శ్రేయ ఘోషల్ కి చిన్ననాటి నుండే సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమె తన 16వ ఏట టీవీలో వచ్చేటువంటి ‘స రి గ మ’ అనే రియాలిటి షో లో సింగర్ గా పోటి చేసి గెలిచింది. అనంతరం ఆమెకి సంజయ్ లీల భన్సలి బాలీవుడ్ లో ‘దేవదాస్’ సినిమాకి పాడటానికి అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. శ్రేయ ఘోషల్ పాడిన ఎన్నో పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అంతేకాకుండా ఆమెకు నాలుగు నేషనల్ అవార్డ్స్ , మూడు స్టేట్ అవార్డ్స్, ఐదు ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ వచ్చాయి.
శ్రేయ ఘోషల్ తెలుగులో ‘ నువ్వు ఏం మాయ చేసావో కాని’ సినిమాలో మొదటి సారిగా తెలుగులో పాడారు. అలాగే మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమాలో కూడా ఆమె పాడారు. ఈ మధ్య ఆమె అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసు గుర్రం’ సినిమాలో కూడా పాడటం జరిగింది.
123తెలుగు.కామ్ తరుపున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు