అందాల సమంతకు జన్మదిన శుభాకాంక్షలు

అందాల సమంతకు జన్మదిన శుభాకాంక్షలు

Published on Apr 28, 2013 10:00 AM IST

samantha

ఈరోజు సమంత పుట్టినరోజు, ఈ పుట్టినరోజు ఆమెకు చాలా ప్రత్యేకం. రెండేళ్ళ క్రితం ‘ఏం మాయచేసావే’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె అంతకంతకు తనను తాను అభివృద్ధి పరుచుకుంటూ ఈరోజు టాలీవుడ్లోనే అగ్రతారగా వెలుగొందుతుంది. కిందటి యేడాది అనారోగ్యం కారణంగా తను మూడు నెలలు సినీరంగానికి దూరంగావుంది.

ఈమధ్య ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో తను తీసుకున్న మూడు నెలల విరామం తన జేవితాన్నే పూర్తిగా మార్చేసిందని, అప్పటినుండి తాను సమాజానికి ఒపయోగాపడే పనులు చెయ్యాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. తాను మొదలుపెట్టిన పనికి ఆమె ఫ్యాన్స్ నుండి మంచి స్పందనే వస్తుంది. వాళ్ళ సహకారంతో తను అనుకున్న సమాజసేవకు నిధులు సమకూరుతున్నాయట.

ఇదిలావుండగా సమంతపై కొన్ని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఆమె చాలా బిజీ అయిపోయిందని, దానివల్ల ఆమె నిశబ్ధంగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం ఆమె హరీష్ శంకర్- ఎన్.టి.ఆర్ కలయికలో వస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో నటిస్తుంది. ఇదే కాక పవన్-త్రివిక్రమ్ సినిమా, సంతోష్ శ్రీనివాస్ యొక్క తదుపరి సినిమాలో, విక్రమ్ కుమార్ తీస్తున్న ‘మనం’లో, ‘ఆటోనగర్ సూర్య’లో మరియు సూర్య సరసన మరో తమిళ చిత్రంలో నటిస్తుంది. ఈ అందాల భామకు 123తెలుగు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు