రామ్ గోపాల్ వర్మకి జన్మదిన శుభాకాంక్షలు

రామ్ గోపాల్ వర్మకి జన్మదిన శుభాకాంక్షలు

Published on Apr 7, 2013 12:01 PM IST

RGV
ఇండియన్ సినిమా ప్రపంచంలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్స్ లో ఒకరైన రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు ఈ రోజు. 1989 లో తీసిన ‘శివ’ సినిమా నుంచి ఇటీవలే తీసిన ‘ది అటాక్స్ అఫ్ 26/11’ వరకూ ఎన్నో రకాల జోనర్స్ పై వర్మ ప్రయోగాలు చేసారు. నాగార్జున, అమలతో చేసిన ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా ధోరణిని మార్చేశాడు. శివ సినిమా తర్వాత ‘క్షణ క్షణం’, ‘దెయ్యం’, ‘రాత్రి’, ‘గాయం’ లాంటి సినిమాలను తెలుగువారికి అందించిన వర్మ ఆ తర్వాత ‘రంగీలా’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు.

ముంబాయి అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ‘సత్య’ సినిమా అప్పట్లో బాలీవుడ్లో సంచలనాలు సృష్టించింది. ఆ తర్వాత మాఫియా డాన్స్ అయిన దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లాంటి వారి మీద సినిమాలు తీసారు. చాలా కాలం తెలుగులో గ్యాప్ తీసుకున్న వర్మ ‘రక్త చరిత్ర’, ‘కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతను బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ అందుకొని చాలా కాలం అయినా అతనిలో సినిమా తీయాలని ఉన్న స్పిరిట్ మాత్రం వెలకట్టలేనిది.

మాతో పాటు ఎంతో మంది వర్మని ఇష్టపడతారు, త్వరలోనే మీరు బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ వర్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

తాజా వార్తలు