హ్యాపీ బర్త్ డే తో మాస్ మహారాజ రవితేజ

Power_raviteja1
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజగా పేరు తెచ్చుకున్న రవితేజ పుట్టిన రోజు ఈ రోజు. 1990లలో 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఎంతో కష్టపడిన తనకి పాత్రలు సంపాదించుకున్నాడు. పూరి జగన్నాథ్ మొదటగా తీసిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం అతనికి సోలో హీరోగా గుర్తింపునిస్తే ఇడియట్ సినిమా తన కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. దాంతో గత 10 సంవత్సరాలుగా రవితేజ చాలా బిజీగా ఉన్నాడు. అలాగే ఇప్పటివరకూ సుమారు 25 సినిమాలు చేసాడు.

సమ్మర్లో రవితేజ ‘పవర్’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్దమవుతున్నాడు. గత సంవత్సరం ‘బలుపు’ సినిమాతో హిట్ అందుకున్న రవితేజ ఎంతో జోష్ గా పవర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పవర్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కెఎస్ రవీంద్ర(బాబీ) డైరెక్టర్.

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ ఫిబ్రవరి 19వరకు జరగనుంది. అలాగే కొన్ని కీలక సన్నివేశాలను కోల్ కతా, నాగ్ పూర్ లలో కూడా చిత్రీకరించనున్నారు. విక్రమార్కుడు తర్వాత రవితేజ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

రవితేజ ఇలానే వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యాలని కోరుకుంటూ 123telugu.com తరపున మాస్ మహారాజ రవితేజకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version