స్టార్ నిర్మాత బండ్ల గణేష్ పుట్టినరోజు ఈ రోజు. ఆయన నటుడి నుండి నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపడ్డారు. ఇండస్త్ర్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో బిట్ రోల్స్ చేశారు. అనంతరం చిన్న చిన్న పాత్రలు, కామెడీ పెర్ఫార్మెన్స్ చేస్తూ అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు ఒక పెద్ద నిర్మాతగా మారాడు. ఆయన మొదట పురిజగాన్నాథ్ సినిమాతో సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. పౌల్ట్రీ బిజినెస్ ద్వారా సంపాదించిన డబ్బుతో బండ్ల గణేష్ నిర్మాణ సంస్థని స్థాపించాడు. అనంతరం ఆయన నిర్మించిన’గబ్బర్ సింగ్’, ‘బాద్షా’, ‘ఇద్దమ్మాయిలతో’ సినిమాలు మంచి హిట్ సాదించాయి.
ప్రస్తుతం ఆయన భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా తీస్తున్నాడు. ప్రస్తుతం పోలంచిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
123తెలుగు.కామ్ తరపున నిర్మాత బండ్ల గణేష్ కు జన్మదిన శుభాకాంక్షలు