సూర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు


కోలీవుడ్లో తన నటనతో విలక్షణ నటుడిగా తన కంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో సూర్య. ‘గజిని’ చిత్రం ద్వారా సూర్యకి తెలుగులో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ రోజు సూర్య పుట్టిన రోజు. తమిళ నటుడు శివకుమార్ కి సూర్య 1975 జూలై 23న జన్మించారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్, సినిమాల్లోకి వచ్చిన తర్వాత సూర్యగా పేరు మార్చుకున్నారు. 1997 లో ‘నేర్రుక్కు నెర్’ అనే చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ‘నంద’, ‘కాక్క కాక్క (ఘర్షణ)’, పితామగన్(శివ పుత్రుడు), ‘గజిని(గజిని )’, వేల్(దేవా), ‘వారణం ఆయిరం (సూర్య s/o కృష్ణన్)’, ‘అయన్(వీడొక్కడే)’, ‘సింగమ్(యముడు)’ మరియు ‘7 ఏయం అరివు (సెవెంత్ సెన్స్) చిత్రాలతో సూర్య తమిళ మరియు తెలుగు పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. సౌత్ ఇండియన్ చిత్రాల్లో నటించి అందరికీ పరిచయమున్న అందాల భామ జ్యోతికని సూర్య 2006లో పెళ్లి చేసుకున్నారు. సూర్యకి ఇప్పుడు దియా అనే ఒక పాప మరియు దేవ్ అనే ఒక బాబు ఉన్నారు.

ప్రస్తుతం సూర్య కే.వి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాట్రాన్’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో ‘డూప్లికేటు’ గా అనువదిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత ‘సింగం 2’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటారు.

ఈ రోజు సూర్య పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున సూర్యాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version