తమిళనాడులో చక్రం తిప్పనున్న హన్సిక

hansika
తమిళ సినిమా రంగంలో బిజీబిజీగా వెలుగుతున్న తారలలో హన్సిక ఒకరు. ఆమె నటిస్తున్న భారీ సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదలకానున్నాయి. సింగం 2,సమ్ థింగ్ సమ్ థింగ్, బిర్యానీ సినిమాలతో గత ఏడాది హిట్ లను అందుకుంది

శింబుతో విఫల ప్రేమాయణం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ మీడియా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం కెరీర్ పై దృష్టిసారిస్తున్న ఈ భామ శివ కార్తికేయన్ సరసన ‘మాన్ కరాటే’ సినిమాలోనటించింది. ఏప్రిల్ 4న మనముందుకు రానున్న ఈ సినిమా మంచి ప్రీ రిలీజ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అడుగుపెట్టనుంది. ఈ సినిమా గనుక విజయం సాధిస్తే హన్సికకు తమిళ చిత్రసీమలో ఇక ఎదురు లేదని చెప్పాలి. జయం రవి, ఆర్యల సరసన కూడా ఈ భామ నటిస్తుంది

తెలుగులో పాండవులు పాండవులు తుమ్మెద సినిమా తరువాత ఈ భామను రామ్ నటిస్తున్న పండగ చేస్కో సినిమాకోసం ఎంపిక చేసుకున్నారు

Exit mobile version