మన్మథ చిత్రంతో తెలుగు వారికి బాగా పరిచయమైన శింబు నిజ జీవితంలో కూడా మన్మధుడే. ఇప్పటికే అనేక మంది సెలెబ్రిటీలతో ప్రేమాయణం నడిపారు ఈ హీరో. ఐతే హీరోయిన్స్ నయనతార, హన్సికలతో ఈయన ప్రేమ బాగా పాపులర్ అయ్యింది. చాలా కాలం నయనతార తో ఘాడమైన ప్రేమ కొనసాగించిన ఈ హీరో పెళ్ళి వరకు వెళ్లి వెనక్కి తగ్గాడు. నయన్ తో బ్రేక్ అప్ అయిన తరువాత కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చి హన్సిక తో ప్రేమ కొనసాగించారు. వీరి బంధం కూడా పెళ్లి వరకు వెళ్ళి బ్రేక్ అప్ అయ్యింది.
బ్రేక్ అప్ తరువాత చాలా కాలం ఎడమొహం పెడమొహం గా ఉన్న ఈ మాజీ లవర్స్ ఈ మధ్య కలిసి సినిమాలలో కనిపిస్తున్నారు. ఇదే విషయమై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హన్సికను అడుగగా అవును మేము ప్రేమించుకొని విడిపోయిన మాట వాస్తవమే…ఐతే విడిపోయిన ప్రేమికులు స్నేహితులు కాకూడదా? ప్రస్తుతం మేమిద్దరం మంచి స్నేహితులం అని చెప్పి వారి సందేహాలను తీర్చింది. ఇక గత ఏడాది సందీప్ కిషన్ హీరోగా వచ్చిన తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్ సినిమాలో హన్సిక నటించింది.