తన సినిమా అనువాదహక్కులపై హన్సిక ఆంక్షలు

తన సినిమా అనువాదహక్కులపై హన్సిక ఆంక్షలు

Published on Oct 5, 2013 7:50 PM IST

hansika_motwani_latest_phot

తమిళ చిత్రసీమలో వరుస విజయాలతో మంచి ఊపు మీద వున్న హన్సిక చేతిలో ఇప్పుడు ఏకంగా 6 తమిళ సినిమాలు వున్నాయి. అనుకోని పుకార్ల వలన తరచూ వార్తలలో నిలుస్తున్న ఈ భామకు సంబంధించిన తాజా వార్త ఏమిటంటే తన తెలుగు సినిమాను అనువాదిస్తున్న ఒక తమిళ నిర్మాతపై కేసు వేసిందట

హన్సిక గతంలో నితిన్ తో కలిసి ‘సీతారాములకళ్యాణం.. లంకలో’ అనే సినిమాలో నటించింది. ఇప్పుడు తమిళ్ లో హన్సికకు వున్న ఇమేజ్ ను వాడుకుంటూ శివ ప్రకాశం అనే తమిళ నిర్మాత ఈ సినిమాకు సంబంధించిన అనువాదహక్కులను చేసుకుని ‘రౌడీ కొట్టై’ పేరుతొ విడుదలచేద్దామనుకున్నాడు. ఇప్పుడు హన్సిక తానూ తెలుగు సినిమా ఒక్కదానికే సంతకం చేసానని, తమిళ అనువాదం గురించి తనకు ముందుగానే తెలుపలేదని మండిపడింది. దీనికి వాళ్ళ అమ్మగారు కూడా వత్తాసు పలుకుతున్నారు. కానీ మరోవైపు శివప్రకాశం ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కుంటామని అనువాద హక్కులు అమ్ముడయ్యాక సినిమా విడుదలను ఎవ్వరూ ఆపలేరని తెలిపాడు

తాజా వార్తలు