హన్సిక తమిళంలో నటించిన ‘ఓకే ఓకే’ సినిమాకి గాను సైమా అవార్డ్స్ వేడుకలో ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడంతో ప్రస్తుతం హన్సిక ప్రస్తుతం ఖుషీ ఖుషీగా ఉంది. అలాగే ఆమె సందడి చేసిన రెండు రోజులు సూపర్బ్ డ్రెస్ లతో అందరినీ ఆకర్షించింది. అలాగే సైమా వాళ్ళు అవార్డు ఇచ్చినందుకు ఎంతో సంబరపడడమే కాకుండా సైమా వాళ్ళు ఈ ఈవెంట్ తో సౌత్ ఇండియన్ సినిమా లెవల్ ని మరో లెవల్ కి తీసుకెళ్లారని, అలాగే షో ని విజయవంతం చేయడానికి వారి టీం ఎంతో కష్టపడ్డారని తెలిపింది.
ఈ రెండు రోజులు సైమా అవార్డ్స్ వేడుకలో జరిగిన అన్ని పెర్ఫార్మన్స్ లు చాలా ఆకట్టుకున్నాయని ముఖ్యంగా సింగర్ ఉషా ఉత్తప్ పెర్ఫార్మన్స్ బాగా ఆకట్టుకుందని హన్సిక తెలిపింది. అలాగే ఈ వేడుకలో హన్సిక కూడా తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది.