చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హన్సిక చాలా తక్కువ వయసులోనే హీరోయిన్ గా మారింది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ 16ఏళ్ల వయసుకే ఆమెను హీరోయిన్ గా వెండితెరకు పరిచయం చేశాడు. 2007లో వచ్చిన దేశముదురు హీరోయిన్ గా హన్సిక మొదటి చిత్రం. తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యాక ఈ భామ తమిళంలో పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం అక్కడే ఎక్కువగా నటిస్తున్న ఈమె.. గత ఏడాది సందీప్ కిషన్ కి జంటగా తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ చిత్రంలో నటించింది.
గతంలో హీరో శింబుని ప్రేమించిన ఈమె ఎందుకో అతనితో విడిపోయింది. కాగా ఈ మధ్య హన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు రావడం జరిగింది. వాటిపై హన్సిక స్పందించారు. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో అర్థం కాదు. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు అన్నారు. అలాగే నాకు పెళ్లి కుదిరితే మీకు చెవుతాను అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలలో హన్సిక నటిస్తుంది.