మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకులకు, పాటల రచయితలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రచారం చేయడానికి, వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్నాడు. అసలు విషయం ఏంటంటే గత సంవత్సరం కాపీ రైట్ యాక్ట్ సవరణ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్స్, పాటల రచయితలకు ఆడియో కంపెనీ లాభాల్లో కొంత షేర్ ఇవ్వాలని నిర్ణయించింది. సినిమా ఆల్బమ్స్ విషయంలో అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి మ్యూజిక్ కంపెనీలు అడ్వాన్స్ గానే కొంత అమౌంట్ చెల్లిస్తామని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కానీ వాస్తవానికొస్తే అలా చెల్లించాల్సిన మొత్తాన్ని వాళ్ళు చెల్లించడం లేదు. యువన్ శంకర్ రాజ, హారిస్ జైరాజ్, డి ఇమాన్ తదితరులు ఈ విషయాన్ని పలు ఇండస్ట్రీ ల్లోని మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ప్రచారం చేస్తున్నారు.
‘ యువన్ శంకర్ రాజ, హారిస్ జైరాజ్, డి ఇమాన్, ఎస్ఎ రాజ్ కుమార్, రాజమణి, ఎన్ఆర్ రఘునాథన్, నేను కలిసి సైన్ చేసిన ఓ పిటీషన్ ని మ్యూజిక్ యూనియన్ కి పంపాము. అడ్వాన్స్ పేమెంట్ కి వ్యతిరేకంగా మరో వారంలో మ్యుజిషియన్స్అంతా కలిసి ఓ ప్రెస్ మీట్ పెడతాం. కంపోజర్స్ అలాంటి వాటికి సైన్ చెయ్యాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ యూనియన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కంపెనీ లాభాల్లో వాటా అనేది క్రియేటర్ యొక్క హక్కు. కానీ ముందే చెల్లిస్తామన్న అగ్రిమెంట్స్ చెల్లవని’ జివి ప్రకాష్ ట్వీట్ వేసాడు. ఆడియో కంపెనీలకు కూడా సిడిలు పెద్దగా సేల్స్ కాకపోవడం వల్ల, పైరసీ ఎక్కువగా ఉండడం వల్ల పెద్దగా లాభాలేమీ రావడం లేదు. రానున్న వారాల్లో ఈ విషయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.