విషాదం: బలగం నటుడు మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ‘బలగం’ సినిమాలో చిన్న తాత పాత్ర పోషించిన నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన వరంగల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలిసి చిత్ర దర్శకుడు వేణు ఎక్స్‌ వేదికగా మెసేజ్ పోస్ట్ పెట్టారు. జీవీ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ‘‘జీవీ బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని ‘బలగం’తో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది.

నటుడు జీవీ బాబు మరణం పట్ల పలువురు నాటక ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం తెలుపుతూ.. నటుడు జీవీ బాబు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మా 123తెలుగు.కామ్ తరఫున నటుడు జీవీ బాబు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Exit mobile version